యువరాజుకే కాంగ్రెస్ పగ్గాలు?

January 13, 2015 | 12:26 PM | 22 Views
ప్రింట్ కామెంట్

ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ యువరాజు రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పజేప్పాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన 10 జన్ పథ్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ చీఫ్ గా రాహుల్ నియమించటంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితాపై మల్లాగుల్లాలు పడుతోంది. షీలా దీక్షిత్ ను పక్కనపెట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సోనియా, అసెంబ్లీ నామమాత్రపు ప్రాతినిధ్యం కాకుండా, కొన్ని సీట్లైనా గెలుచుకుని సత్తాచాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే భూసేకరణ అంశంపై పార్లమెంటు లోపల బయట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎన్నికల వైఫల్యం నేపథ్యంలో ఆఫీస్ బేరర్ల నియామకంపై కూడా చర్చిస్తున్నారు. కాగా ఈ సమావేశంలో సీనియర్ నేతలైన మాజీ ప్రధాని మన్మోహన్, చిదంబరం, అహ్మద్ పటేల్ తోపాటు రాహుల్ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ కంటే వేరే ప్రత్నామ్నాయం లేదని వారంతా భావిస్తున్నారేమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ