రాధేమా పై రోజుకో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆధ్యాత్మికత ముసుగులో ఆమె పలు అక్రమాలకు పాల్పడిందంటూ ఇప్పటికే చాలా మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా మోడల్ అర్షిఖాన్ వేసిన ఓ బాంబుతో రాధేమా చుట్టు ఉచ్చు మరింత బలంగా చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో రాధేమా ఓ సెక్స్ రాకెట్ నడిపిందంటూ ఆర్షిఖాన్ ఆరోపించింది. ఈ విషయమై గతంలో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందట. రాధేమా మేనేజర్ ఓసారి తన దగ్గరికి వచ్చి ఆ సెక్స్ రాకెట్ లో చేరాడని అడిగాడట. దాంతో ఆమె చిర్రున అతగాడిపై లేవటంతోపాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందట. ఆర్షిఖాన్ పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అన్నట్లు గత నెలలో బాలీవుడ్ నటి డాలీ బింద్రా కూడా రాధేమా సెక్స్ రాకెట్ నడిపిందని ఆరోపణలు చేసింది. మరోవైపు వరకట్నం కేసులో రాధేమాను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఎర్రమాతకి ఎన్ని కష్టాల్లో...