భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా అందించే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం జాబితాను సిద్ధం చేసింది. వివిధరంగాల్లో ప్రతిభ కనబరిచిన 148 మందికి ఈసారి అవార్డులు ప్రకటించింది. బీజేపీ కురువ్రుద్ధుడు అద్వానీ తోపాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, అధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురు బాబా రాందేవ్ లకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కనున్నాయి. నటుడు దిలీప్ కుమార్, మాజీ ఎన్నికల చీఫ్ ఎన్. గోపాలస్వామిలను పద్మభూషణ్ లకు ఎంపిక చేసింది. వీరితోపాటు పి.వి.సింధు, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు కూడా పద్మ జాబితాలో ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో చంద్రయాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎస్. కే. శివకుమార్, బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్, భారత హకీ జట్టు కెప్టెన్ సర్ధార్ సింగ్, కుస్తీవీరుడు సుశీల్ కుమార్, ఆయన కోచ్ సత్పాల్, ఎవరెస్ట్ అధిరోహించిన తొలివికలాంగురాలు అరుణిమ సిన్హా, చెస్ గ్రాండ్ మాస్టర్ శశికిరణ్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, హెచ్ సీఎల్ చీఫ్ శివనాడార్, సంగీత దర్శకుడు అనుమాలిక్, తుంకూర్ సిద్ధగంగా మఠం హెడ్ శివకుమారస్వామి, జగద్గురు రమణానందచార్య, స్వామి రమభద్రాచార్య, స్వామి సత్యమిత్రానందగిరి, తదితరులు ఉన్నారు. దివంగత నటుడు ప్రాన్ కు కూడా పద్మ అవార్డు ప్రకటించారు. జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరంతా అవార్డులు అందుకోనున్నారు.