అవినీతిపై అరుణ్ జైట్లీ ఆవేదన

January 22, 2015 | 05:48 PM | 48 Views
ప్రింట్ కామెంట్

భారత దేశంలో ఎన్నాళ్ళుగానో అవినీతి రాజ్యమేలుతుందనీ, అది ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతి ముద్ర ఉండడం వల్లనే చాలా కాలంగా భారత్ ఆర్థికంగా ఎదగడం లేదని ఆయన అన్నారు. ఇక అవినీతిని ఏ మాత్రం సహించేది లేదని, దీనిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. అవినీతి రూపు మాపడానికి అవసరమైతే కొత్త చట్టాలను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. దేశ ప్రతిష్ఠను అవినీతి మంటగలుపుతుందనీ, దీన్ని అంతం చేస్తే గానీ భారత్ బాగుపడదని ఆయన అన్నారు. ఈ విషయంలో అందరూ భాగస్వాములయితేనే ఇది సాధ్యపడుతుందని ఆయన కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ