ఎయిరిండియా విమానాల్లో నాన్ వెజ్ బంద్

December 26, 2015 | 04:55 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Air_India_serve_only_vegetarian_domestic_flights_niharonline

విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తమ విమానాల్లో అందించే భోజనంపై ఆంక్షలు విధించింది. ఇకపై తమ ప్రయాణికులకు శాకాహార వంటకాలను మాత్రమే అందించనుంది. కేవలం గంటన్నర (90నిమిషాలు), అంతకన్నా తక్కువ సమయంలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కేవలం శాకాహార భోజనమే అందజేయనున్నట్లు ఎయిర్‌ఇండియా సంస్థ శనివారం ప్రకటించింది. అంతేకాకుండా లంచ్‌, డిన్నర్‌ సమయాల్లో టీ, కాఫీలను రద్దు చేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు తమ విమానాల్లో తక్కువ సమయం ప్రయాణించే ప్రయాణికులకు సాండ్‌విచ్‌(శాకాహార, మాంసాహార),కేకు అందజేసేవారు. ఇప్పుడు వాటిని నిలిపివేస్తున్నామని చెప్పారు. వాటి బదులుగా వేడి వేడి శాకాహార భోజనాన్ని అందజేస్తామని చెప్పారు. విమానాల్లో 150మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉంటున్నారని.. దీంతో తక్కువ సమయంలో వారు కోరిన భోజనం అందజేయడం ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు చెప్పారు. అందుకే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వారు పేర్కొన్నారు.  ఇక ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుందని వారు చెప్పారు. ఈమేరకు ఎయిరిండియా సర్క్యులర్ కూడా జారీ చేసింది కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ