అదనపు ఛార్జీలపై ఎయిర్ టెల్ వెనుకంజ

December 29, 2014 | 03:05 PM | 30 Views
ప్రింట్ కామెంట్

స్కైప్, వైబర్ వంటి యాప్స్ వాడుతున్న వారి నుంచి అదనపు చార్జీలను వసూలు చేయాలన్న తన నిర్ణయాన్ని ఎయిర్ టెల్ వెనక్కు తీసుకుంది. కేవలం డేటా మాత్రమే వాడుకుంటూ, ఈ యాప్స్ నుంచి ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను వాడుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తొలుత ఈ అదనపు ఛార్జీల నిర్ణయం తీసుకుంది. అయితే ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థ నిబంధనలు ఇందుకు అంగీకరించవని తెలుసుకున్న కంపెనీ ఛార్జీల పెంపును రద్దు చేసింది. కాగా, ఇంటర్నెట్ టెలీఫోనీపై మాత్రం ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. సమీప భవిష్యత్తులో ఇంటర్నెట్ మాధ్యమంగా చేసే కాల్స్ సంఖ్య గణనీయంగా పెరుగతాయని ఇటీవల ఓ అంచనాలో తేలింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ