కామాంధులకు కట్ చెయ్యటమే కరెక్టా?

October 28, 2015 | 05:04 PM | 3 Views
ప్రింట్ కామెంట్
madras-HC-rapists-castration-in-india-niharonline

ప్రత్యేక చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నా... అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీంతో అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే దోషులకు ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి క్యాస్ట్రేషన్(బీజకోశాలు కత్తిరించి నపుంసకులుగా మార్చటం) సరైన శిక్ష అని మద్రాసు న్యాయస్ధానం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి నిర్భయ ఘటన తర్వాత ఈ శిక్ష గురించి చర్చ మొదలైంది. సాధారణంగా ఇలాంటి శిక్షలు సౌదీ దేశాల్లో అమలవుతూ ఉంటాయి. ఇలాంటి కఠిన శిక్షలు అమలు చెయ్యటం వల్లే అక్కడ ఆడాళ్లపై అఘాయిత్యాలు జరిపేందుకు జంకుతారు. అయితే భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నినాదం మరుగునపడిపోయింది.

తాజాగా మద్రాసు హైకోర్టు క్యాస్ట్రేషన్ పై వ్యాఖ్యానించడంతో మరోసారి దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిజంగా అత్యాచారాలను అడ్డుకోవాలంటే క్యాస్ట్రేషనే సరైన శిక్ష అని ఎక్కువ మంది అభిప్రాయపడుతుండగా, క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితాలు నాశనం చేసే అంత పెద్ద శిక్ష అవసరమా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

              అయితే క్యాస్ట్రేషన్ లో కాస్త వెసులుబాటు ఉన్న సంగతి కూడా ప్రస్తావిస్తున్నారు న్యాయనిపుణులు. ఇందులో రెండు రకాల శిక్షలు ఉంటాయి. ఒకటి నిర్ధాక్షిణ్యంగా బీజకోశాలు కత్తిరించటం అయితే, మరోకటి వీర్యాన్ని, పురుషాంగాన్ని ప్రేరేపించే గ్రంధులను పని చేయనీయకుండా చేయడమే. రెండో పద్ధతిలో ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి రసాయనాలు పంపి ఆ గ్రంధులు స్పందించడం మానేసేలా చేస్తారు. దీంతో నపుంసకత్వం సంభవించి భవిష్యత్తులో తప్పుడు పనులకు పాల్పడరు. మరి మన దేశంలో అత్యాచారాలకు క్యాస్ట్రేషన్ లాంటి శిక్షల అమలు జరుగుతుందా? అందుకు భారత శిక్షాస్మృతిని సవరించడం వీలవుతుందా? అన్నది అత్యున్నత న్యాయస్థానంపై ఆధారపడి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ