మణిపూర్ ‘ఉక్కు మహిళ’కు ఊరట

January 22, 2015 | 05:35 PM | 49 Views
ప్రింట్ కామెంట్

మానవ సంకల్పం ముందు ఏ శక్తి అయిన తల వంచాల్సిందే. పదిహేనుళ్లుగా పంచి మంచినీళ్లైన ముట్టకుండా ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తున్న ఆ మహిళకు కాస్త ఊరట లభించింది. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలపై నమోదైన ఆత్మహత్యాయత్నం కేసును కోర్టు కొట్టివేసింది. ఆహారం తీసుకోకుండా ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమెపై కేసు నమోదైంది. కేసును గురువారం విచారించిన ఇంఫాల్ కోర్టు, దాన్ని కొట్టివేసింది. సాయుధ బలగాల (ఎఫ్ఎస్ఏ)కు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న చట్టాన్ని తొలగించాలంటూ 15 సంవత్సరాల క్రితం ఇరోం షర్మిల నిరాహార దీక్షకు దిగారు. అప్పట్లో ఓ ఎన్ కౌంటర్ కు నిరసనగా దీక్షకు దిగిన ఆమె ఇప్పటికీ తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఆమెకు బలవంతంగా ద్రవాలను శరీరంలోకి పంపుతున్నారు. ఈ క్రమంలో, ఆహరాన్ని తీసుకోకుండా ఆమె ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటూ 2014 లో కేసు నమోదైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ