వృద్ధ పతివ్రతుడి ఆవేదన అర్థం కాదా?

May 14, 2016 | 10:47 AM | 4 Views
ప్రింట్ కామెంట్
asaram-bapu-law-blind-niharonline

దేశంలో న్యాయవ్యవస్థ గుడ్డిది... ఎవరినైనా కటకటాల వెనక్కి పంపుతుంది... అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వయం ప్రకటిత దైవం ఫ్లస్ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక చేసిన ఫిర్యాదు ను కాదు కాదు ఆరోపణను ఆధారంగా తనను అరెస్ట్ చేయటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాడాయన. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కాలేదు ఐనా నాపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 75 ఏళ్ల ఆశారాం. ఆయన తానీ వయసులో అలాంటి పనులు చేయగలనా అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.

               ఇక పోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు.ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వీటిపై జోధ్ పూర్ కోర్టు హాజరైన ఆయనను మీడియా ఆరాతీస్తే... తనకు డజనుకు పైగా వ్యాధులున్నాయని, వాటికి చికిత్సలు తీసుకోవాల్సి వుందని అన్నారు. తనకూ మీడియాతో మాట్లాడాలని వుందని, కానీ మాట్లాడలేకపోతున్నానని దాటవేశారు సంత్ శ్రీ ఆశారామ్‌జీ బాపూ. అమాయకపు చక్రవర్తిలా ఆయన మాట్లాడే పలుకులు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉన్నాయి కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ