అమ్మాయిలను ఎరగా వేసి ఎలా ‘బుక్’ చేస్తారంటే...

April 15, 2015 | 11:00 AM | 50 Views
ప్రింట్ కామెంట్
cricket_players_trapped_by_beautiful_ladies_india_BCCI_niharonline

క్రికెట్ పట్టించే ఏకైక భూతం ఏదైనా ఉందంటే అది ఫిక్సింగ్ అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఎందరో యువ క్రీడాకారులు ఈ మాయలో పడి తమ కెరీర్ సర్వనాశనం చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వాటిని అదుపులో పెట్టేందుకు బీసీసీఐ క్రికెటర్లకు క్లాస్ పీకుతోంది. క్రికెటర్లను వశపరుచుకుని ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలు ఎలాంటి గిమ్మిక్కులు చేస్తారో తెలిపింది. అంతేకాదు అందులో ఇరుక్కొవద్దంటూ బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లను హెచ్చరించింది. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందో వివరంగా వారికి వివరించింది. డబ్బు కన్నా అమ్మాయిలకే ఆటగాళ్లు త్వరగా పడిపోతారట. అందమైన అమ్మాయిలను ఎంపిక చేసి అభిమానుల రూపంలో పంపి, వారిద్వారా ఆటగాడిని ట్రాప్ చేస్తారని. తొలుత ఫోన్ సంభాషణలు, ఆపై డిన్నర్లు, డేటింగ్ వంటి ఎత్తులు వేస్తారని వివరించింది. బంధం బలపడిందని గ్రహించిన తర్వాత వారిరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూసి క్రీడాకారులను బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకుంటారని తెలిపింది. ఇక ఈ సమయంలో చాలా మంది అధికారులకు ఫిర్యాదు చేయలేక ఈ రొంపిలో దిగుతారని వివరించింది. ఒకసారి బుకీలు, ఫిక్సర్ల వలలో పడితే మాత్రం వెనక్కు రావటం అంత సులభం కాదని బీసీసీఐ చెబుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ