సహజీవనం = పెళ్లి... వాటా ఇవ్వాల్సిందే

April 13, 2015 | 12:33 PM | 58 Views
ప్రింట్ కామెంట్
living_together_equals_to_marriage_supreme_court_of_India_niharonline

వివాహం చేసుకోకుండా దీర్ఘకాలంపాటు ఇద్దరు కలిసి ఉంటే (సహజీవనం) వారిని పెళ్లయిన వాళ్లుగానే భావిస్తామని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సహజీవన భాగస్వామి చనిపోయిన తర్వాత అతని ఆస్తికి ఆమె వారసురాలు అవుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఏ రాయ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తమ తాత ఆస్తులపై కొందరు మనవలు, మనవరాళ్లు కలిసి వేసిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. తమ బామ్మ 20 సంవత్సరాల క్రితం చనిపోగా, అప్పటినుంచి తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదని తెలుపుతూ... ఇటీవల తాత మరణించారిన, వీరికి పెళ్లి కాలేదు కాబట్టి ఆయన ఆస్తికి ఆమె వారసురాలు కాదని వాదించారు. ఆ మహిళ తనకు వివాహం అయిందని నిరూపించుకోలేకపోయినప్పటికీ, కోర్టు మాత్రం అనుకూలంగానే తీర్పు ఇవ్వడం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ