ప్రముఖుల నుంచి తీసుకున్న ఆటోగ్రాఫులను అభిమానులు ఎంతో అపురూపంగా భావిస్తారు. ముఖ్యంగా, క్రీడాకారుల విషయంలో ఆటోగ్రాఫులు కోరే అభిమాలను సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఆటోగ్రాఫుల కారణంగా ప్లేయర్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇక తాజాగా, బీసీసీఐ మ్యాచ్ ఆడే సమయంలో ఆటోగ్రాఫులు ఇవ్వొదద్దని క్రికెటర్లకు స్పష్టంచేసింది. ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ టీ 20, భారత్ లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్ లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఓ ఆటోగ్రాఫ్ బుక్ సాయంతో బుకీలు కీలక సమాచారాన్ని ఆటగాళ్లతో పంచుకునే అవకాశం ఉందని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అనుమానిస్తోంది. ఆటోగ్రాఫుల వ్యవహారాన్ని కట్టడి చేయటం కష్టేమే అయినా, క్రికెట్ శ్రేయస్సు ద్రుష్ట్యా నిషేధానికి ప్రయత్నిస్తున్నామని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కేఎస్ మాధవన్ తెలిపారు.