ధూమపానం కేన్సర్ కు కారణమవుతుందని నమ్మేవారు తాను చెప్పే మాటలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ అస్సాం లోక్ సభ సభ్యుడు రామ్ ప్రసాద్ శర్మ అంటున్నాడు. ప్రతిరోజు ఓ ఫుల్ బాటిల్, 60 సిగరెట్లు తాగే ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు. వారిలో ఒకరు 86 ఏళ్లకు చనిపోయారు. మరోకరు ఇంకా బతికే ఉన్నారు. కాబట్టి పొగతాగడం వల్ల కేన్సర్ వస్తుందనే వారు ఈ విషయాన్ని గమనించాలి’’ అని సదరు ఎంపీ చెబుతున్నారు. ఈ క్రమంలో పోగాకు ఉత్పత్తులకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల్లో శర్మ మూడోవాడు. అంతే కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ ముగ్గురూ కూడా పొగతాగడాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులు కావటం గమనార్హం.