ఆ ఎంపీ నలుగురు పిల్లల్ని కనమంటున్నాడు

January 07, 2015 | 03:51 PM | 52 Views
ప్రింట్ కామెంట్

నోరు జాగ్రత్త అని స్వయానా ప్రధాని మోదీ చెప్పినా… బీజేపీ ఎంపీలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా యూపీకి చెందిన ఎంపీ సాక్షి మహరాజ్ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన చెప్పారు. యూపీలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నలుగురు పిల్లల్లో ఒకరిని సైన్యానికి పంపాలని, మరొకరిని ఆధ్యాత్మిక గురువులకు ఇవ్వాలని, మిగిలిన వాళ్లను టీచర్లుగా చేయాలని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంతమంది పిల్లలు ఉండాలనేది కూడా బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో ఉన్నట్లుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ఎద్దేవా చేశారు. భారతదేశం అంటే హిందూదేశమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇంతకుముందు అన్నారు. కానీ ఈ దేశంలో చాలామంది హిందువులను ఇతర మతాల్లోకి బలవంతంగా మారుస్తున్నారని సంజయ్ విమర్శించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ