ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బీ

January 07, 2015 | 12:17 PM | 42 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ని వైద్య, ఆరోగ్య శాఖకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విషయమై ఆయనను సంప్రదించగానే ఉచితంగా సేవలు అందించేందుకు అమితాబ్ ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. అంటే బిగ్ బీని ఇకపై వైద్య ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఏపీ హెల్త్ మినిస్ర్టీ అంబాసిడర్‌గా చూడవచ్చన్నమాట. అమితాబ్ ఇప్పటికే గుజరాత్ రాష్ర్ట టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయన ప్రచారం చేయటం వల్లే గుజరాత్ పర్యాటక శాఖా ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. సంవత్సరానికిగానూ జాతీయస్థాయితో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ