చికెన్ వద్దు... గొడ్డు మాంసమే ముద్దు

March 30, 2015 | 02:13 PM | 133 Views
ప్రింట్ కామెంట్
beef_ban_effect_on_lions_in_india_niharonline

పలాష్... ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో అతిపెద్ద టైగర్. మొన్నటివరకూ రోజుకు సుమారు 7 కిలోల గొడ్డు మాంసాన్ని ఇష్టంగా లాగించేది. ఇక తాజాగా మహారాష్ట్రలో గోవధ నిషేధం తర్వాత క్రూర జంతువులు ఇష్టమైన ఆహరం కోసం అలమటిస్తున్నాయి. ఒక్క పలాష్ మాత్రమే కాదు. పార్క్ లోని మరో 8 రాయల్ బెంగాల్ జాతి పెద్ద పులులు. 3 సింహాలు, 14 చిరుతలు, 3  రాబందులకు నిత్యమూ అందించే గొడ్డు మాంసం బదులు అధికారులు కోడి మాంసం ఇస్తున్నారు. గొడ్డు మాంసం కన్నా చికెన్ తేలికగా ఉండటంతో జంతువులకు ఆహరం రుచించడం లేదని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని జంతువులూ కోపంతో అరుస్తున్నాయిన వివరించారు. వీటికి చికెన్ అయ్యేదాకా పరిస్థితి ఇంతేనేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ