నింగికెగిసిన పీఎస్ఎల్వీసీ27

March 28, 2015 | 05:38 PM | 96 Views
ప్రింట్ కామెంట్
pslv c27_niharonline

భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీఎస్ఎల్వీసీ27 రాకెట్ నింగికెగిసింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు. సొంత నావిగేషన్ వ్యవస్థను అభివ్రుద్ధి చేసుకునేందుకు ఉద్దేశించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. తయారీకి రూ.125 కోట్లు ఖర్చైంది. భారత నావిగేషన్ వ్యవస్థ మొత్తం ఏడు ఉపగ్రహాలతో కూడినది. తాజా ఉపగ్రహంతో కలిపి ఇప్పటివరకు నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ