యాగ ప్రసాదంగా మేక మాంసం?

May 04, 2016 | 02:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
karnataka-temple-Goat-meat-yaga-prasadam-niharonline

ఓవైపు గుళ్లో మహిళల ప్రవేశాల మీద, వేషాధారణపై న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు జరుగుతుంటే, ఇంకోవైపు మనోభావాలు దెబ్బతినే కార్యాకలపాలు జరుగుతూనే ఉన్నాయి. యాగ ప్రసాదంగా మేక మాంసంను పంచిపెట్టిన షాక్ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా మట్టూరులో సోమయాగం పేరిట ఏప్రిల్ 22 నుంచి 27వ తేదీ వరకు ఈ యాగం నిర్వహించినట్లు సమాచారం. ఈ యాగంలో ఆవునెయ్యి, సమిధలు, యాగ ద్రవ్యాలతో పాటు 8 మేకలను కూడా బలిచ్చారనే వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. మేకలు బలిచ్చిన అనంతరం భక్తులకు అదే మాంసాన్ని ప్రసాదంగా పెట్టారు. పురాతన వేద సంప్రదాయం ప్రకారం బ్రహ్మణుల సమక్షంలోనే ఈ యాగం నిర్వహించామని నిర్వాహకులు సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం విషయం బయటికి రావటంతో మరో వర్గం బ్రహ్మణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాగ నిర్వాహకులపై కోర్టులో కేసు వేస్తామని ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ