అలర్ట్ : గార్డెన్ సిటీ మోస్ట్ డేంజరస్ గా మారనుంది

May 03, 2016 | 12:49 PM | 2 Views
ప్రింట్ కామెంట్
bengaluru-pollution-most-dangerous-level-niharonline

ఇండియాలో సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న బెంగళూరు వచ్చే ఐదేండ్లలో నివాస యోగ్యానికి పనికిరాకుండా పోతుందట. దేశంలోనే ఉత్తమ ఇనిస్టిట్యూట్ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఈ సంచలన నివేదికను వెలువరించింది. గడచిన 40 సంవత్సరాల్లో బెంగళూరులో నివాస ప్రాంతాలు 525 శాతం పెరిగిపోయాయని, ఒకనాడు గ్రీన్ సిటీగా పేరున్న నగరంలో ఇప్పుడు 78 శాతం వృక్ష జాతి అంతరించి, చల్లగా ఉండే వాతావరణం రికార్డు స్థాయి వేడికి పెరిగిందని హెచ్చరించింది. నగరంలోని నీటి వనరుల్లో 79 శాతం కరిగిపోయాయని గుర్తు చేసింది.

ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, పట్టణీకరణ నగరాన్ని నాశనం చేస్తున్న పద్ధతిని చూపుతుందని ఐఐఎస్సీ ప్రొఫెసర్ టీవీ రామచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నగరం నివాసయోగ్యం కాదని చెప్పే పరిస్థితి నుంచి, ఐదేళ్లలోనే నగరం రూపురేఖలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే స్థాయికి వచ్చాయని చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇటీవలి కాలం వరకూ సహజ వాయువులతో నిండిన నగరం, ఇప్పుడు విషపూరిత కాలుష్యాలతో నిండిపోయిందని అన్నారు. 25 ఏళ్ల క్రితం 40 లక్షలుగా ఉన్న జనాభా, ఇప్పుడు కోటికి పైగా చేరుకుందని, ప్రభుత్వాలు వెంటనే స్పందించకుంటే పరిస్థితి జఠిలమవుతుందని హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ