పెళ్లి కూతురినే ఐటెం గర్ల్ చేద్దామనుకున్నారు

March 14, 2016 | 04:36 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Bride-force-for-item-song-at-wedding-groom-niharonline

పెళ్లిలో సరదాలు సందడ్లు కామనే. గానా బజానా, డాన్సులతో ఫుల్ హోరెత్తిస్తారు. అయితే పెళ్లి కొడుకు మరీ శృతి మించిపోవటంతో కాలిన పెళ్లికూతురు ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్న ఘటన ఆగ్రాలో జరిగింది. ఫిరోజాబాద్ జిల్లాలో ఓ యువ‌కుడికి ప‌క్క గ్రామానికి చెందిన ఓ యువ‌తికి పెళ్లి నిశ్చయించారు. ఓ వైపు పెళ్ళి జ‌రుగుతుండగా పెళ్ళికొడుకు స్నేహితులు వధూవరుల్ని డాన్స్‌ చేయాల్సిందిగా పిలిచారు. అయితే పెళ్ళికూతురు తన వల్ల కాదంది. కాసేపు ఒక్కడే డాన్స్‌ చేసిన పెళ్ళికొడుకు తర్వాత ఆమెను మళ్ళీ పిలిచాడు. ఆమెకు ఇష్టం లేకపోవటంతో బలవంతపెట్టాడు. అవమానం పట్టలేక ఆ అమ్మాయి దండలు విసిరి పారేసి వెళ్ళిపోయింది.

                     ఆమె తండ్రి కూడా ధైర్యంగా కూతురి పక్షాన్నే నిలిచి మగపెళ్ళివారిని వెళ్ళిపొమ్మన్నాడు. పెళ్లి కుమార్తెను ఐటెం గ‌ర్ల్‌గా ఆడ‌మంటారా అని ఆమె త‌ర‌పు బంధువులు పెళ్లికొడుకుపై ఒక్కసారిగా ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఇక స్నేహితులు ఆడిన వికృత క్రీడ‌కు అక్కడున్న వారంతా మండిపడ్డారు. ఆపై గొడవ చేయబోయిన పెళ్ళికొడుకుసహా ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ