ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పెళ్లిళ్ల పాలిట కోతులు విలన్లుగా మారుతున్నాయి. వివాహా వేడుకల్లో దూరి నానా బీభత్సం చేసేస్తున్నాయి. ఇది వధువుల పాలిట తీవ్ర తలనొప్పిగా మారింది. దీంతో వారిప్పుడు కోతుల ప్రధాన శత్రువులైన కొండముచ్చులను ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రజల అవసరాన్ని పసిగట్టిన వాటి యజమానులు రూ. 1500 నుంచి ఏకంగా రూ. 10 వేల వాటికి అద్దెకట్టిస్తున్నారు. ఇక, కొందరైతే ఏకంగా నెలవారీ ఫ్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు. శీతకాలంలో ఇక్కడ వివాహాలను బహిరంగా ప్రదేశాలలోనే నిర్వహిస్తారు. దీంతో కోతుల పెళ్లిళ్లలో దూరి రచ్చరచ్చ చేసేస్తున్నాయి. తన పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఓ కోతుల గుంపు వచ్చి తన మీద కూర్చోన్నాయని భయంతో తాను పరిగెత్తానని ఓ పెళ్లికూతురు వాపోయింది. కొండముచ్చులు ఉంటే ఆ దరిదాపుల్లోకి కోతులు రావని భావిస్తున్న పెళ్లి కూతురుల బంధువులు ఇప్పుడు వాటి శరణు వేడుతు కనిపిస్తున్నారు.