పంచాయితీ పెద్దల దాష్టీకం: శీలానికి ఖరీదు కట్టిన మూర్ఖులు

January 31, 2015 | 04:43 PM | 48 Views
ప్రింట్ కామెంట్

సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలపై జరుగుతున్న దాష్టీకాల్ని డబ్బుతో కప్పెట్టేస్తున్నారు. తాజాగా బీహార్లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. పని కోసం పంచాయితీ ఆపీస్ కు వెళ్లిన ఓ దళిత మహిళపై ప్రకాశ్, నరేష్ అనే వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె పంచాయితీ పెద్దలను ఆశ్రయించింది. న్యాయం చేస్తారనుకున్న వారేమో ఆమె శీలానికి రూ.41,000 ఖరీదు కట్టారు. డబ్బులు తీసుకుని ఆ ఘటనను ఇంతటితో మరిచిపోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఆగ్రహించిన ప్రకాశ్ బాధితురాలి భర్తకు నిప్పింటించి పరారయ్యాడు. విషయం పోలీసుల దాకా వెళ్లటంతో వారు రంగంలోకి దిగి నరేష్ ను అదుపులోకి తీసుకొని ప్రకాశ్ కోసం గాలింపు చేపట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ