ఆ ముఖ్యమంత్రి వారసత్వ ఆస్తిని వద్దనుకున్నాడు

January 13, 2015 | 05:45 PM | 29 Views
ప్రింట్ కామెంట్

రాజకీయాల్లోకి వస్తే ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే ఈ రోజుల్లో, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని ఈ త్యాగం చేశారు. తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వంగా ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన ప్రభుత్వానికి రాసిచ్చేశారు. కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఈ ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేసేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ