బాదినా భరించేవాడే భర్తంట

January 13, 2015 | 05:06 PM | 24 Views
ప్రింట్ కామెంట్

భార్య విచ్చలవిడిగా ప్రవర్తించినా భర్త భరించాల్సిందేనట... విడాకుల కోసం భర్త కోర్టుకి వెళ్లితే కుదరదని చెప్పేసింది ముంబై హైకోర్టు. భార్య తనని కొడుతూ హింసిస్తోందని ఫిర్యాదుతో కోర్టుకు వెళ్లిన ఆ భర్తకు నిరాశే ఎదురైంది. ‘నా భార్య తరచూ పబ్‌కు వెళుతుంది... పిల్లలను సరిగా చూసుకోవడం లేదు, నన్ను కూడా కొడుతోంది. వేడి వేడి టీ ని నాపై విసిరి కొట్టింది’ అని సదరు భర్త కోర్టుకు తన ఆవేదనను తెలియబరిచాడు. అయితే కోర్టు మాత్రం అతడి ఆవేదనను పట్టించుకోలేదు సరికదా ఆమెకే అండగా నిలబడింది. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఈ మేరకు తీర్పును ఇవ్వగా... తాజాగా ముంబై హై కోర్టు కూడా అదే తీర్పును సమర్థించింది. మరి ఇవే పనులు భర్త చేస్తే నానా రచ్చ అయిపోదు. పాపం ఆ భర్త.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ