అవునండీ... బాలీవుడ్ శృంగార దేవత సన్నీలియోన్ ని ఓ సీపీఐ నేత తిట్టిపోశారు. ఆయన అనేది ఏంటంటే ఆమె వల్లే దేశంలో రేప్ లు ఎక్కువయ్యాయట. సీపీఐ నేత అతుల్ అంజన్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ... సన్నీ లియోన్ ది ఈ మధ్య ఓ యాడ్ చూశాను. దాంతో దేశంలో రేప్ లు ఖచ్ఛితంగా పెరుగుతాయి అని ఆవేశంగా మాట్లాడాడు. అసలు ఆ సంబంధం ఏంటి? సన్నీది ఆ యాడ్ ఏంటీ? ఆ యాడ్ లో అంతలా ఏం చూపించింది? అనుకుంటున్నారా... కంగారు పడకండి చెబుతాం... ఈమధ్య ఓ ప్రముఖ కండోమ్ కంపెనీ వారు సన్నీ తో ఓ యాడ్ ను షూట్ చేశారు. గతంలో కూడా ఇదే కంపెనీ కోసం ఆమె ఓ యాడ్ లో నటించింది. కానీ, లేటెస్ట్ యాడ్ లో అది కాస్త శృతి మించింది ( అని ఆ నేత ఉద్దేశం). దీనిపై ఆయన స్పందిస్తూ... బాలీవుడ్ లొ మన దౌర్భాగ్యానికి ఒక హీరోయిన్ ఎంటర్ అయ్యింది. ఒకప్పుడు బ్లూ ఫిల్మ్ లు తీసిన ఆమెను ఓ పెద్ద మనిషి (మహేష్ భట్) ఇండియాకు తీసుకు వచ్చారు.. ఇక ఆమె రెచ్చిపోతుంది చూడండి... ఆమె తీసే సినిమాలు చూసి మహిళలు సిగ్గుతో తలదించుకునే స్థాయికి చేరుకున్నాయి. ఇంటర్ నెట్ లో ఆమె బొమ్మలు చూసి అందరూ చెడిపోతున్నారు. అసలు ఆ యాడ్ గనుక అన్ని టీవీల్లో ప్రచారం చేస్తే దేశంలో రేప్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ’’ అని సిపిఐ లీడర్ అతుల్ అన్నారు. మొత్తానికి యాడ్ వల్ల దేశంలో రేప్ కేసులు పెరుగుతాయిని చెప్పడంతో కొత్త వార్త మీడియా వారికి, యువతకు లభించింది. అయినా లైట్ లేండి... ఆయన మాటలు సీరియస్ గా తీసుకునేదేవరు. అయినా సన్నీలియోన్ తో ఇలాంటి యాడ్ లు కాకుండా... అమ్మను మరిచిపోలేం అంబికాను మరిచిపోలేం అంటూ అగరబత్తి యాడ్ తీస్తే ఎవరైనా చూస్తారా. పాపం సన్నీకొచ్చే పాపులారిటీని చూసి ఓర్వలేకే ఇలా ఆడిపోసుకుంటున్నారని ఆలిండియా సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఫీలయిపోతున్నారు.