మేక్ ఇన్ ఇండియాకు కోర్టు కష్టాలు!

February 01, 2016 | 12:47 PM | 1 Views
ప్రింట్ కామెంట్
make-in-india-Summit-At-Chowpatty-supreme-court-niharonline

మేక్ ఇన్ ఇండియా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన కాంపెయిన్.  భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి ప్రభుత్వం యొక్క  నూతన పథకం. ప్రధానంగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులకు 125 కోట్ల జనాభాతో బలమైన భారతదేశం - ఒక తయారీ కేంద్రంగా నిర్మించడానికి మరియు ఉద్యోగావకాశాలు సృష్టించడానికి హామీ పూర్వక అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. అలాంటి ప్రతిష్టాత్మక పథకంకు కూడా కోర్టు కష్టాలు తప్పటం లేదు. ఫిబ్రవరి 13 నుంచి ముంబైలోని ప్రముఖ చౌపాతీ బీచ్ లో 'మేకిన్ ఇండియా' సదస్సుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తుండగా, బీచ్ సదస్సుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారించనుంది. సినిమా సెట్టింగ్స్ ను తలపించే సదస్సు వేదిక, భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు, ఆరు రోజుల పాటు సాగనున్న సుదీర్ఘ సదస్సు... జరగాలా? వద్దా? అన్నది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించాల్సి వుండగా, సాధ్యమైనంత త్వరగా సుప్రీం తీర్పు వెలువడకుంటే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కష్టమై సదస్సు ఆగిపోయే ప్రమాదం ఉంది.

కాగా, ఇప్పటికే బీచ్ లో సదస్సుకు మహారాష్ట్ర హైకోర్టు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో సుప్రీం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనని పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దాదాపు 10 వేల మందికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్న సదస్సుకు బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్, అత్యంత సుందరంగా కనిపించే సెట్లను తయారు చేశారు. ఇది ఓ కార్నివాల్ వంటిదని, ఎవరైనా రావచ్చని మహా సర్కారు ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. ఇండియాకు పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న సదస్సును బీచ్ లో ఏర్పాటు చేయడంపై కొందరు పారిశ్రామికవేత్తలు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఒకవేళ సదస్సు జరగకుంటే భారత పరువు విదేశీ పెట్టుబడిదారులు దృష్టిలో గంగలో కలిసినట్టేనని హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ