గిత్తలతో కుమ్ములాటకు గ్రీన్ సిగ్నల్

January 08, 2016 | 11:45 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Centre allows TN to conduct Jallikattu niharonline

తమిళనాట ఈ సంక్రాంతికి పోట్ల గిత్తలతో యువత పోటీ పడి మరీ పరుగెత్తనుంది. గిత్తల కొమ్ములు పట్టుకుని వంచేస్తూ తమ జబ్బ బలం కూడా చూపించనుంది. సంక్రాంతి సందర్భంగా తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోనూ కోడె గిత్తలతో యువకులు పోట్లాడే జల్లికట్టు ఏటా రసవత్తరంగా జరుగుతోంది. అయితే జంతు హింసతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు గాయపడుతున్న ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని ఇటీవల పలు వర్గాల నుంచి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని మోదీ సర్కారుకు వినతులు వెల్లువెత్తాయి.

                  అనాదిగా కొనసాగుతూ వస్తున్న తమ సంప్రదాయానికి అడ్డు చెప్పొద్దంటూ తమిళ ప్రజలు రెండు ప్రభుత్వాలకు విన్నవించారు. తమిళుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. తమిళనాడులో జల్లికట్టుతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడ్ల పందాలకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఈ సంక్రాంతి సందర్భంగా తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో జల్లికట్టు ఉత్సాహంగా జరగనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ