రూపాయి చెల్లించడం కన్నా అదే బెటర్

January 07, 2016 | 05:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
TRAI-lack of investment-infrastructure-for-call-drops-niharonline

కాల్ డ్రాప్ అయితే వినియోగదారుడికి రూపాయి చెల్లించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెలిఫోన్ వినియోగదారుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అలా చెల్లిస్తే తీవ్రంగా నష్టపోతామని పేర్కొంటూ టెలికాం సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ట్రాయ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. టెలికం ఆపరేటర్లు టవర్లను ఏర్పాటు చేయడంపై పెట్టుబడులు పెట్టకపోవడం వల్లే వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది.

                             గతంలో కంటే ఇప్పుడు డేటా వాడకం గణనీయంగా పెరిగిందని, అయినప్పటికీ టవర్లను ఏర్పాటు చేయలేదని ట్రాయ్ ఆరోపించింది. ఇందువల్లే వినియోగదారుడు కాల్ డ్రాప్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రాయ్ పేర్కొంది. ఈ మేరకు గణాంకాల వివరాల అఫిడవిట్ ను ట్రాయ్ న్యాయస్ధానానికి దాఖలు చేసింది. దీనికి పరిష్కారంగా కాల్ డ్రాప్ అయితే వినియోగదారుడికి రూపాయి చెల్లించాలని ఆదేశించినట్టు తెలిపింది. ట్రాయ్ వాదనను జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ వింది. కాగా, సమస్య తలెత్తకుండా టవర్ల నిర్మాణానికి ట్రాయ్ గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ