చంపినా సరే ఆ పులి నిర్దోషి!

October 03, 2015 | 01:54 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tiger-attacks-and-kills-a-vistor-at-Delhi-Zoo-accident-committee-niharonline

క్రూరమైనప్పటికీ ఆ మూగజీవిని కోర్టు కనికరించారు. ఆ మధ్య ఢిల్లీ జూలో జరిగిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. 22 పంవత్సరాల మసూద్ అనే ఓ యువకుడు ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో పులి ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించాడు. ఇక అక్కడే ఉన్న ఓ పెద్దపులి చాలా సేపు ఉద్రిక్త క్షణాల తర్వాత అతగాడిని మెడ కొరికి చంపింది. ఆ వీడియో అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సంగతి కూడా తెలిసిందే. గత సంవత్సరం సెప్టెంబర్ 23న ఈ ఘటన జరుగగా  అప్పటి నుంచి కోర్టులో దీనిపై కేసు నడుస్తూనే ఉంది.

ఘటన పై పూర్తి స్థాయి వాదోపవాదనలు విన్న కోర్టు పులి తప్పేమీ లేదని తీర్పునిచ్చింది.  యువకుడు దుస్సాహసం చేసి పులి నివాసంలోకి దూకాడని, ఆపై దానిపై కొందరు రాళ్లు రువ్వి వేధించారని దాంతోనే పులి అతన్ని మట్టుపెట్టిందని కేంద్రం నియమించిన విచారణ కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ జయంత్ నాధ్ లతో కూడిన ధర్మాసనానికి అందించిన కమిటీ, ఈ తరహా చర్యలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. జూలో హెచ్చరిక బోర్డులు ఉన్నాయని, పులి జోన్ చూట్టూ కంచె వుందని, జూ అధికారుల తప్పూ లేదని, సెక్యూరిటీ హెచ్చరిస్తున్నా వినకుండా, పులి దగ్గరగా వెళ్లి ప్రమాదవశాత్తూ లోపలికి పడిపోయాడని తెలిపింది. దీన్నో దురదృష్టకర ఘటనగా వ్యాఖ్యానించిన కమిటీ, ఎవరి తప్పూ లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూ నిర్వాహకులను అప్రమత్తం చెయ్యాలని కమిటీ సూచించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ