న్యాయ వ్యవస్థపై గ్యాంగ్ స్టర్ మోడలింగ్ మరక

May 28, 2015 | 02:14 PM | 3 Views
ప్రింట్ కామెంట్
mumbai_sessions_court_dossa_conducting_modeling_niharonline

ఓ క్రిమినల్ చేసిన నిర్వాకంతో భారత న్యాయవ్యవస్థపై మరక పడింది. 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో విచారణను ఎదుర్కొంటున్న గ్యాంగ్ స్టర్ ముస్తఫా దొస్సా సెషన్స్ కోర్టు హాల్లో మోడలింగ్ అడిషన్స్ నిర్వహించటం సంచలనం రేపింది. ఓ దుబాయ్ సంస్థకు మోడల్ ను ఎంపిక చేసేందుకు జైల్లోనే డీల్ ఒప్పుకున్న ముస్తఫా 8 మంది మోడళ్లను కోర్టు హాలుకు పిలిచి అడిషన్స్ చేశాడు. ఈ ఉదంతాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ముంబై క్రైం బ్రాంచ్ ఈ వ్యవహారంలో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అడిషన్స్ లో ఎంపికైన 19 సంవత్సరాల యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు ముందు డబ్బులిచ్చారని, ఆపై పోలీసు వేషాల్లో వచ్చిన ఇద్దరు దుండగులు ఆ సోమ్మును ఎత్తుకెళ్లారని యువతి ఆరోపించింది. కాగా, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుల్లో దావూద్ ఇబ్రహీంతోపాటు టైగర్ మెమన్, మహమ్మద్ దొస్సా లు నిందితులుగా ఉన్నారు. ముస్తఫా దొస్సాను మాత్రం 2003లో అరెస్టు చేశారు. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ