మాములుది కాదు, మహాభారతం నాటిది... కాపాడండి

May 27, 2015 | 02:29 PM | 33 Views
ప్రింట్ కామెంట్
mahabharath_gita_banyan_tree_jyotisar_kuruksetra_NGT_nihar

మర్రి వృక్షం... వట వృక్షం. ఏళ్ల తరబడి జీవించే ఈ చెట్టు ఆయా గ్రామాల చరిత్రను తెలిపేందుకు ప్రతీకలుగా ఉంటాయి. తాజాగా మహాభారత కాలం నాటికి చెందిన ఓ మర్రిచెట్టును కాపాడేందుకు ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థలు క్యూ కడుతున్నాయి. ఏళ్ల నాటి ఈ చెట్టు దాదాపు మహాభారత కాలంకి చెందిందని, అంతేకాదు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ చెట్టు కిందే భగవద్గీతను బోధించాడని భక్తులు విశ్వసిస్తారు. పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రతినిధులు కూడా దీని పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. శాస్త్రవేత్తలు సైతం ఈ చెట్టు వయస్సు దాదాపు 5వేల సంవత్సరాల క్రితంకు చెందిందని తేల్చటంతో ఇక గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనిని రక్షించేందుకు రంగంలోకి దిగింది. హర్యానా లోని కురుక్షేత్ర ప్రాంతంలో జ్యోతిసర్ దగ్గర ఉన్న ఈ చెట్టు మాత్రమే మహాభారత కాలం నాటి ఏకైక ఆధారమని ఎన్జీటీ నిర్ధారణకు వచ్చింది. అంతేకాదు ఈ చెట్టు ను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని అక్కడి అధికారులకు నోటీసులు జారీచేసింది. భక్తులు తమ కోరికలు తీరాలని ఆశిస్తూ, చెట్టుకు దారాలు కట్టడం, వివిధ రకాల గంటలను కొమ్మలకు వేలాడదీయటం చెట్టు ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని అధికారులు చెబుతున్నారు. పాపం వారు మాత్రం ఏంచేస్తారు, వద్దన్న ఆపుతారా మన జనాలు. చరిత్రకు సాక్ష్యాలుగా భావి తరాలకు కూడా ఈ చెట్టు విశిష్టత గురించి తెలియాలంటే దీనిని బతకనీయటం వారి(జనాల) చేతుల్లోనే ఉందని గుర్తిస్తే బెటర్.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ