భగత్ సింగ్, ఆజాద్ లు ఉగ్రవాదులా?

April 28, 2016 | 05:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bhagat-singh-terrorist-delhi-university-book-niharonline

ఢిల్లీ యూనివర్శిటీ ప్రచురించిన ఒక పాఠ్యగ్రంథంలో దేశం కోసం అమ‌రుడైన భ‌గ‌త్‌సింగ్‌ను 'విప్లవ ఉగ్రవాది'గా పేర్కొన్న అంశంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) స్పందించింది. పాఠ్య‌ గ్రంథంలోంచి ఆ ప‌దాన్ని తొల‌గించాల‌ని సూచిస్తూ ఆ వ‌ర్సిటీకి లేఖ రాసింది. ఉగ్ర‌వాది అన్న పదాన్ని ఉప‌యోగిస్తే దేశ పౌరుల మ‌నో భావాలు దెబ్బ‌తింటాయ‌ని ఢిల్లీ యూనివ‌ర్సిటీకి రాసిన లేఖ‌లో పేర్కొంది. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సూర్యసేన్ వంటి దేశ భ‌క్తుల గురించి ప్రస్తావించేట‌ప్పుడు వారిని ఉగ్రవాదులుగా పేర్కొనవద్దని తెలిపింది. వివాదాస్పదంగా ఉన్న రెవెల్యూష‌న‌రీ టెర్ర‌రిస్ట్, టెర్రిరిస్ట్ యాక్ట్‌, యాక్ట్ ఆఫ్ టెర్ర‌రిజం అనే ప‌దాలను తొల‌గిస్తూ మార్పులు చేయాల‌ని ఢిల్లీ యూనివ‌ర్సిటీకి సూచించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఇలా ఉగ్రవాదులుగా ముద్రవేయటం సరికాదని వారి వారసులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ