కొడుకు తప్పుకు తల్లిని వివస్త్రని చేసి కొట్టారు

April 26, 2016 | 03:03 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Elderly woman stripped tortured as son elopes with girl

సమాజంలో ఉన్నాం అన్న సంగతి మరిచి, మ‌నుషుల‌న్న స్పృహ లేకుండా  మృగాల్లా ప్రవ‌ర్తించారు. 60 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ ఉదంతం సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. లకింపూర్‌‌ఖేరికి చెందిన ఓ జంట పెద్దలు పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో పారిపోయింది. త‌మ కూతురు పారిపోవ‌డంతో సదరు యువ‌తి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. త‌మ కూతుర్ని మాయం చేశారంటూ అబ్బాయి ఇంటికి యువ‌తి త‌ల్లిదండ్రులు వెళ్లారు. వ‌య‌సులో ఉన్న కుమారుడిని అదుపులో పెట్టలేదంటూ ఇంట్లో ఉన్న అబ్బాయి తండ్రిని తీవ్రంగా కొట్టారు. అనంత‌రం యువ‌కుడి త‌ల్లిపై అమానుషానికి దిగారు. ఆమె బట్టలు విపదీసి,  త‌మ వెంట తెచ్చుకున్న కారాన్ని యువ‌కుడి త‌ల్లిపై చ‌ల్లారు. చెప్పుకోలేని భాగాల్లో కారం చ‌ల్లి రాక్ష‌సుల్లా, ఉగ్ర‌వాదుల్లా ప్ర‌వ‌ర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక‌ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ