భారత క్రికెట్ టీంలో అనేక సంచనాలు సృష్టించాడు థోనీ. 2005లో ధోని టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 60 టెస్టులకు ధోని కెప్టెన్గా వ్యవహరించారు. అయితే, గత కొంత కాలంగా ధోని తీసుకుంటున్న నిర్ణయాలు ఫెయిల్ అవుతుండటంతో విమర్శలను గురవుతూ వచ్చాడు. ఇక్కడ ఎన్నో విజయాలు సాధించిన ధోనీ, విదేశీ గడ్డపై పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, ఈ మధ్య జరుగుతున్న పరిణామాల కారణంగా ఎదుర్కుంటున్న విమర్శకులకు తావు ఇవ్వకూడదని స్వచ్ఛందంగా ధోని టెస్ట్ లకు గుడ్ బై చెప్పేసాడు. అయితే అతను టెస్టులకు గుడ్ బై చెప్పడంతో ట్విట్టర్ లో ఆయనకు అనేక స్పందనలు వస్తూనే ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. ఇప్పటివరకూ చవిచూసిన విజయాలకు అభినందనలు తెలిపి, థోనీతో కలిసి ఆడడం తను చాలా ఎంజాయ్ చేశాననీ, ఇకపై 2015 వరల్డ్ కప్ టార్గెట్ చేయాలని సూచించారు.