కస్టమర్లే క్రియేటర్లంటున్న డొకోమో

December 23, 2014 | 11:38 AM | 28 Views
ప్రింట్ కామెంట్

తొలినాళ్లలో ఫోన్ నంబర్ల విషయంలో వచ్చిందే తీసుకోవడమే ఉండేది. రానురాను నచ్చిన నంబర్ ను ఎంచుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా కస్టమర్లు వారికి నచ్చినట్టుగా ఓ నంబర్ ను క్రియేట్ చేసుకునే అవకాశం ఏర్పడింది. డోకోమో సంస్థ ఈ బంఫర్ ఆఫర్ ను కస్టమర్లకు అందిస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన అంకెలతో ఓ నంబర్ ను క్రియేట్ చేసి ఇస్తే ఆ నంబర్ పై సిమ్ ను యాక్టివేట్ చేసి ఇస్తుందట. కొత్త వినియోగ దారులకే కాదు ప్రస్తుత కస్టమర్లు కూడా ఈ సేవను వినియోగించుకోవచ్చునని చెబుతోంది. అయితే కండిషన్లు అప్లై అన్న కంపెనీ అవేంటో చెప్పలేదు. దిగితేకానీ లోతు తేలీదన్నట్టు సర్వీస్ ను వాడితే కానీ అందులో మెలికలు తెలీవు కదా. ఏదేమైనా తమ లక్కీ నంబర్లతో ఫోన్ నంబర్లకు కావాలనుకునేవారికి మాత్రం ఇది మంచి అవకాశమే. మరి ఇంకెందుకు ఆలస్యం దగ్గర్లోని డోకోమో స్టోర్లకు ఎగబడిపోండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ