పరిపాలనా వ్యవహారాల్లో అనవసర జోక్యం తగదని సుప్రీంకోర్టుకు మోదీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాస్త గట్టిగానే చెప్పింది. పరిపాలన, విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే బదులు, గుట్టలుగా పేరుకుపోయి ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మాార్గాలు వెతకాలని సుప్రీంకు సూచించింది. కాగ్ బాధ్యతలను రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మకు అప్పగించటంపై ధాఖలైన పిటిషన్ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ... కాగ్ అధిపతిగా ముకుల్ రోహత్గి ఉన్నసమయంలోనే కొనుగొళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఆయనే ఎలా పర్యవేక్షిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనను కేంద్రం మాత్రం తొసిపుచ్చింది.