దేశ దేశాలన్నీ మహత్ముడికి నీరాజనాలు పడుతుంటే... మన నేతలు మాత్రం తరచూ ఆయన్ను వివాదాల్లోకి లాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ గాంధీని చంపిన గాడ్సేని పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నేత అలాగే వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ మధ్య వివాదాలతో బాగా పాపులర్ అయిన వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచి ఏకంగా గాంధీపైనే విమర్శలు ఎక్కపెట్టారు. గాంధీని జాతిపితగా అభివర్ణించటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. స్వాతంత్రోద్యమంలో నూలు వడికిన గాంధీ కంటే భగత్ సింగ్ లేదా వీరసావర్కర్ లాంటి వాళ్ల పోరాటమే ఎక్కువ ఉందని, కాబట్టి వాళ్లలో ఎవరికైనా జాతిపిత గుర్తింపు ఇవ్వాలని అలీఘడ్ లో జరిగిన ఓ సభలో ఆమె వ్యాఖ్యానించారు. మరీ ఈ వ్యాఖ్యలు ఏపాటి దుమారాన్ని లేపుతాయో వేచిచూడాలి.