నెట్ లేకుండానే ఫోన్లో దూరదర్శన్ చానెళ్లు

April 21, 2015 | 01:21 PM | 50 Views
ప్రింట్ కామెంట్
doordarshan_channels_in_smart_phone_niharonline

అతి త్వరలో మీ స్మార్ట్ ఫోన్లలో దూరదర్శన్ అందించే అన్ని టెలివిజన్ చానల్స్ నూ ఎటువంటి ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, వైఫై కనెక్షన్ లేకుండా తిలకించే సదుపాయం కలుగనుంది. ఈ మేరకు ప్రసార భారతి, తాము తయారు చేసిన బ్లూప్రింట్ ను సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే ప్రైవేట్ చానల్స్ తో పోటీపడలేక చతికిలపడ్డ దూరదర్శన్ చానెళ్లు తిరిగి అత్యధిక వ్యూవర్ షిప్ సాధించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ సర్కార్ వివరించారు. తొలిదశలో 20 వరకూ ఉచిత చానెళ్లు అందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటిల్లో దూరదర్శన్ అందిస్తున్న చానెళ్లతోపాటు పాపులర్ చానెళ్లు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఓ చిన్న డాంగిల్ ను ఫోన్ కు అమర్చటం ద్వారా టీవీ కార్యక్రమాలు వీక్షించవచ్చని తెలిపారు. శాంసంగ్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఈ డాంగిల్ ను సులభంగా స్మార్ట్ ఫోన్లోనే అమర్చవచ్చని తెలియజేశారు. ఇందుకు అవసరమైన సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉన్నందున అనుమతులు రాగానే ముందడుగు వేస్తామని ఆయన అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ