ఓలా కొత్త యాడ్ పై రచ్చ రచ్చ

April 25, 2016 | 12:13 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ola-cab-controversial-ad-niharonline

క్యాబ్ దిగ్గజం ఓలా విడుదల చేసిన ఓ టీవీ కమర్షియల్ యాడ్ ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది. మైక్రో క్యాబ్ సేవలను పరిచయం చేస్తూ తీసిన ఈ యాడ్ పై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది.

ఓ యువ జంట షాపింగ్ చేస్తున్నట్టు ప్రారంభమయ్యే ఈ యాడ్ లో, యువతి షాపింగ్ కు యువకుడు డబ్బు చెల్లిస్తూ వస్తుంటాడు. చివరికి అతని పర్సు ఖాళీ అవుతుంది. దీంతో అతగాడు " కిలోమీటర్ కు నా గర్ల్ ఫ్రెండ్ ఖరీదు 525 రూపాయలు. కానీ, ఓలా క్యాచ్ మాత్రం కిలోమీటర్ కు 6 రూపాయలే తీసుకుంటుంది. ప్రేయసిని డేటింగ్ కు తీసుకురావడం కన్నా ఓలా మైక్రో క్యాబ్ బుక్ చేసుకోవడం చౌక" అని అంటాడు. వారిద్దరు క్యాచ్ లో ఎక్కుతుండగా కిలోమీటరుకు రూ. 6తో ప్రయాణించవచ్చని చూపుతూ ప్రకటన ముగుస్తుంది.

                       ఇప్పుడీ యాడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ఇంత ఛీప్ పబ్లిసిటీ చేయాలా అని యువత నుంచి సోషల్ మీడియాలో తిట్లు పడుతున్నాయి. ఢిల్లీలో సరి-బేసి విధానం అమలవుతున్న వేళ, క్యాబ్ లను ఆశ్రయించే ప్రజల నుంచి అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓలా, తాజాగా, ఈ యాడ్ తో మరిన్ని ఇబ్బందులో పడింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ