ముసుగులేసే ఆడవాళ్లని అక్కడ మూసేస్తారట

February 21, 2015 | 12:44 PM | 71 Views
ప్రింట్ కామెంట్
Rule_passed_veling_girls_arrest_in_MP_niharonline

ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ అమ్మాయిలు ముసుగులు(స్కార్ఫ్లు) కట్టుకుని తిరగటం ఫ్యాషనైపోయింది. పోనీ పగటి పూట పోలుషన్ నుంచి రక్షణ అనుకుంటే ఫర్వాలేదు. మరీ రాత్రి పూట సందుల్లో కూడా అంటే టూమచ్ కదా. ఈ ఫ్యాషన్ ఒకటి రెండు రాష్ట్రాలలో కాదు... దేశం మొత్తం మీదా ఉంది. ఇక దీనిపై మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మేయర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు. సాత్నా కు కొత్త మేయర్ గా ఇటీవల విధుల్లోకి వచ్చిన మమతా పాండే ముసుగు సంస్క్రుతిపై విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇకపై ముసుగులేసుకుని తిరిగే అమ్మాయిలు దయ, జాలి లేకుండా జీపెక్కించండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. బురఖా సంస్క్రుతి ముస్లిం మహిళల్లో ఉంది. హిందూ మహిళలేమో కొంగు కప్పుకోవాలి. అంతేకాని దొంగళ్లా ముఖానికి ముసుగులేసుకోవటం ఏంటని ఆమె ప్రశ్నిస్తుంది. ఇకపై ఇలాంటివి కుదరవు. అంతేకాదు ముసుగు వేశాలేసుకుని అక్కడ కొందరు మోసాలకు పాల్పడుతున్నారట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. మన దగ్గర కూడా ఈ రూల్ వస్తే ఎంత బావుండో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ