మతగురువు వివాదాస్పద వ్యాఖ్యలు: ముస్లింల తొలిదైవం శివుడట

February 19, 2015 | 02:34 PM | 33 Views
ప్రింట్ కామెంట్
mufti_ilyas_controversy_comments_niharonline

మత పరమైన వ్యాఖ్యలు దేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందుతత్వ వాదులే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పటిదాకా చూశాం. కానీ, మొదటి సారి ఓ ముస్లిం మత గురువు తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముస్లింల తొలి దైవం పరమ శివుడేనని, ముస్లిలందరూ ఒకప్పుడు సనాతన ధర్మాన్ని పాటించేవారని జమైత్ ఉలేమాకు చెందిన మతగురువు ముఫ్తీ మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనల్ని స్రుష్టించింది శివపార్వతులేనని కూడా ఆయన అన్నారు. మేము ఇండియాను హిందూ దేశానిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించం. చైనాలో నివసిస్తున్నవారిని ఎలాగైతే చైనీయులు, జపనీయులు అంటారో, అలాగే మనల్ని హిందుస్తానీ అనవచ్చు అన్నాడు. జమైత్ ఉలేమాకు చెందిన పలువురు మత నాయకులు అయోధ్యను సందర్శించారు. ఈ నెల 27న జరిగే మత హింస వ్యతరేక సదస్సుకు హాజరుకావాలని పలువురు సాధునేతలను వారు కోరారు. మరీ ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో వేచిచూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ