కట్నం అడిగినోడికి పంచాయితీ ‘పెద్ద’ల తీర్పు

April 15, 2015 | 02:23 PM | 30 Views
ప్రింట్ కామెంట్
haryana_panchayath_75_paise_fine_niharonline

కట్నం అడిగినందుకు మగ పెళ్లి వారి తరపున వారికి హర్యానాలోని పంచాయితీ పెద్దలు అవాక్కయ్యే జరిమానాను విధించి ఆశ్చర్యపరిచారు. అసలు పంచాయితీ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న ఈ ఘటన ఫతేహాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే... అడిగినంత కట్న కానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగ పెళ్లివారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోగా, వధువు తరపు బంధువులు పంచాయితీ పెట్టారు. పెళ్లికి ముందు వరుడికి కారు ఇవ్వాలని వారు డిమాండ్ చేయగా, అందుకు వధువు తరపు పెద్దలు అంగీకరించలేదు. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత మగ పెళ్లివారిదే తప్పని నిర్ణయించిన పంచాయితీ పెద్దలు పెద్ద మనసుతో 75 పైసల జరిమానాల విధించారు. అంతేకాదు ఆ డబ్బును అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని మరీ తీర్పు ఇచ్చారు. పెళ్లి ఆగితే ఆగింది. 75 పైసల జరిమానా విధిస్తే విధించారు కానీ, వారిది తప్పని నిరూపించాము అదే చాలు అంటున్నారు అమ్మాయి తరపు బంధువులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ