ఐదు పైసల తప్పుడు కేసు... 40 ఏళ్లకు గెలిచాడు

May 05, 2016 | 04:06 PM | 3 Views
ప్రింట్ కామెంట్
bus-conductor_fight_for_five_paise_niharonline

మన దేశంలో న్యాయం కోసం పోరాటం ఎలా ఉందంటే... ఓ వ్యక్తి కేవలం 5 పైసల కోసం గత 40 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) లో రణవీర్ సింగ్ యాదవ్ (73) పని చేసేవాడు. 1973లో ఆయన కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తుండగా, చెకింగ్ స్టాఫ్ బస్సులో తనిఖీలు నిర్వహించింది. ఈ లెక్కల్లో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 10 పైసలకి బదులుగా 15 పైసలు వసూలు చేశాడని, ఆమె నుంచి అదనంగా 5 పైసలు జేబులో వేసుకోవాలని ప్రయత్నించాడని అతనిపై ఇంటర్నల్ విచారణ నిర్వహించారు.

               దీనిపై 1976 నుంచి ఆయన న్యాయపోరాటం చేసి, 1990లో కార్మికుల న్యాయస్ధానంలో ఆయన ఈ కేసులో విజయం సాధించారు. అయితే  ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అతని వదల్లేదు. 1991లో మళ్లీ అతనిపై కేసును తిరగదోడింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఈ కేసులో విచారణకు హాజరవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు యాదవ్ కు 30 వేల రూపాయల జరిమానా, 1.28 లక్షల పారితోషికం, 1.37 లక్షల సీపీఎఫ్ తదితరాలను తక్షణం చెల్లించాలని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ శాఖను కోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ