వివక్షత లేదు... వారికీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు

July 10, 2015 | 05:41 PM | 5 Views
ప్రింట్ కామెంట్
educational_university_for_hijras_MP_niharonline

తొలిసారిగా దేశంలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక విద్యా కేంద్రం ఏర్పాటు కాబోతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం హిజ్రాల కోసం ప్రత్యేక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ట్రాన్స్ జెండర్ లను మూడో లింగంగా ప్రకటించినప్పటికీ సమాజంలో ఇప్పటికీ వారు వివక్ష ఎదుర్కుంటూనే ఉన్నారు. విద్యాలయాల్లో ప్రవేశాల్లో గానీ, ఉద్యోగాలు కల్పించే విషయంలో గానీ వారిని వేరుగా చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వారికోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించటం విశేషం. దాని నిర్వహాణ బాధ్యతను ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారు. అన్నట్లు దేశంలో మొట్ట మొదటిసారి హిజ్రా ఎమ్మెల్యే ఎన్నికైంది కూడా మధ్యప్రదేశ్ నుంచే...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ