అన్ లైన్లో బూతు వీడియోల సూత్రధారి అతనొక్కడే!

July 07, 2015 | 02:42 PM | 4 Views
ప్రింట్ కామెంట్
kaushik_kuonar_sex_clips_king_niharonline

ఆన్ లైన్లో అశ్లీల వీడియోలు పోస్టు చేస్తూ డబ్బు సంపాదిస్తున్న కేసులో బెంగళూరుకు చెందిన యువకుడే ప్రధాన నిందితుడని సీబీఐ నిర్థారించింది. బెంగళూరులోని సంపన్న కుటుంబానికి చెందిన కౌశక్ కౌనర్ పోర్న్ సైట్ల నుంచి భారతీయ మహిళలు, అమ్మాయిల అభ్యంతరకర వీడియోలను డౌన్ లోడ్ చేసి, వాటిని ఎడిటింగ్ చేసి తిరిగి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. ఆ వీడియోలను ఎవరైనా చూస్తే తద్వారా డబ్బు అతని అకౌంట్ కు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. కొద్దిరోజుల కిందట ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. వాట్సాఫ్ లో ఆ వీడియో బాగా సర్క్యులేట్ కావటంతో హైదరాబాద్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దత్తుకు లేఖ రాసింది. సుమోటోగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులను అరెస్ట చెయ్యాల్సిందిగా సీబీఐను ఆదేశించింది. ఇక ఈ క్రమంలో లైంగిక చర్యలు చిత్రీకరించాడన్న ఆరోపణలపై కౌశక్ కౌనర్ ను మేలో సీబీఐ అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. అతని దగ్గర నుంచి 470 పోర్న్ క్లిప్స్ తోపాటు అత్యాధునిక ఎడిటింగ్ సాప్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్య కెమెరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ