ఖాళీ జులుం మహిళపై ఎలా ఉందో చూడండి

April 29, 2016 | 07:32 PM | 2 Views
ప్రింట్ కామెంట్
woman-assaulted-by-cops-patna-niharonline

ఇలాంటి పనులు మన పోలీసులకు కొత్తేంకాదు. కానీ, అక్రమం పేరిట గుడిసెలు వేసుకున్నారంటూ ఓ బిల్డర్ ఆరోపిస్తే, పోలీసులు వారికి మద్ధతు రావటం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో బీహార్ రాజ‌ధాని పాట్నాలో మ‌హిళ‌పై ఓ పోలీసు అధికారి దాడి చేస్తుండ‌గా కెమెరా కంటికి చిక్కిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మ‌ద్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

                             స్థానిక ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లోని భూమిలో కొందరు గుడిసెలు వేసుకుని నివ‌సిస్తున్నారు. ఆస్థలం నుంచి వారిని ఖాళీ చేయించే క్ర‌మంలో ఒక బిల్డర్ త‌న అనుచ‌రుల‌తో వారిపై దాడికి దిగ‌గా, అక్క‌డ నివ‌సిస్తోన్న వారు తిరిగి దాడి చేశారు. దీంతో అక్క‌డ‌కి చేరుకున్న పోలీసులను చూసి స‌ద‌రు బిల్డ‌ర్ అనుచ‌రులు పారిపోయారు. ఈ క్ర‌మంలో అక్క‌డ నివ‌సిస్తున్న వారిపై పోలీసులు దాడికి దిగారు. దీనిలో భాగంగా ఓ పోలీసు అధికారి మ‌హిళ‌పై చేయి చేసుకుంటుంగా ఓ కెమెరా కంటికి ఈ దృశ్యాలు చిక్కాయి. త‌రువాత సోష‌ల్ మీడియాలోకి ఎక్కేశాయి. మ‌హిళ‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించి, చేయి చేసుకున్న పోలీసు అధికారిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ