ఇక సిగ్గుతో చావాల్సిందే: కామాంధుల బయోడేటా ఆన్ లైన్లో

April 10, 2015 | 03:55 PM | 52 Views
ప్రింట్ కామెంట్
sexual_assault_offenders_biodata_online_niharonline

చిన్న పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు అడ్డుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. చిన్నారులపై లైంగిక దాడి కేసులను ఎదుర్కుంటన్న వారి పేర్లు, చిత్రాలతో కూడిన ఆన్ లైన్ డేటా బేస్ ను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకోసం మేనకా గాంధీ నేత్రుత్వంలోని కేంద్ర మహిళా శిశు అభివ్రుద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర హోం శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా చిన్నారులను వేధింపులకు గురిచేసిన వారి వివరాలు వెల్లడించడం ద్వారా వారు సిగ్గుపడి బుద్ధి తెచ్చుకోవాలన్నది తమ అభిమతమని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందించామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ తరహాలోనే డేటా బేస్ ను నిర్వహిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ