చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు తమ అడుగు జాడల్లోనే నడవాలని కోరుకుంటారు. కానీ, కేరళలో ఓ వైద్యుడు మాత్రం తన కుమార్తెను డాక్టర్ ను మాత్రం కానివ్వబోనని తెగేసి చెబుతున్నాడు. తన కుమార్తె బార్ లో పోల్ డాన్సర్ అయినా అంగీకరిస్తానే తప్ప ఇండియలో వైద్య వృత్తిని మాత్రం స్వీకరించబోనీయనని అంటున్నాడు కేరళలో అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ రోషన్ రాధాకృష్టన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు తన అభిప్రాయానికి గల సహేతుక కారణాలు కూడా చెప్పారు. ‘‘డాక్టర్ వృత్తి అంటే కుటుంబ జీవితాన్ని కోల్పోయినట్టే, కేటాయించిన పని గంటలకు రెండింతలు పని చేయాల్సి వస్తుంది. చాలినంత వేతనాలు ఉండవు. ఇంట్లో సుఖ సంతోషాలు కొరవడతాయి. రోగుల మరణాలను ఆపాల్సిన డాక్టర్లు ఇప్పుడు వారి బంధువుల చేతుల్లో చావకుండా తప్పించుకునే మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఉంది. వృత్తి కోసం ప్రాణాలను తీసుకుంటామా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2015లో ఇండియాలో వైద్య వృత్తిలో ఉన్నవారిలో 75 శాతం మంది ఏదో ఒక విధంగా రోగులు, వారి బంధువుల నుంచి హింసను ఎదుర్కున్న వారే అని వాపోయారు. నీకు ఎన్నో అవకాశాలున్నాయి. నీ మతం మార్చుకోవాలన్నా నీఇష్టం. నువ్వు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారి అమెజాన్ అడవుల్లో తిరగొచ్చు లేదా లాస్ వెగాస్ లోని బార్లలో పోల్ డాన్సర్ గా మారవచ్చు. కానీ, నిన్ను మాత్రం వైద్య వృత్తిని చేపట్టనివ్వను. ఎందుకంటే, గత 20 ఏళ్లుగా నిన్ను పెంచింది నీ ఓటమిని చూసేందుకు కాదు అంటూ రాధాకృష్ణన్ ముగించారు. ఇతర డాక్టర్లు కూడా తమ వృత్తిపై అభిప్రాయాలు చెప్పాలని కోరాడు. మే 15న ఆయన ఈ పోస్ట్ పెట్టగా, ఇప్పటికే 20 వేలకు పైగా షేర్స్ వచ్చాయి. దీనిపై చర్చకు తెరతీస్తూ రెడ్డిట్ ధ్రెడ్ కూడా ప్రారంభమైంది.