వెకిలి చేష్ట: లేడీ డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి!

July 01, 2015 | 11:28 AM | 3 Views
ప్రింట్ కామెంట్
chaudary_lal_singh_lady_doctor_collar_niharonline

ఈ మధ్య నేతలు, ప్రజా ప్రతినిధులు తమ తిక్క తిక్క చర్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అధికార పక్షంలో ఉన్న వారికైతే ఇది మరీనూ. తాజాగా జమ్ము కశ్మీర్ ఆరోగ్య శాఖా మంత్రి చౌదరీ లాల్ సింగ్ వెకిలి చేష్టలకు పాల్పడి వార్తల్లోకెక్కారు. అమర్ నాథ్ యాత్ర కోసం ఆసుపత్రుల్లో ఏర్పాట్లపై పరిశీలనకు వెళ్లిన ఆయన లఖన్ పూర్ లోని ఓ ఆసపత్రిని సందర్శించారు. అక్కడ ఓ వైద్యురాలిని చూసి ఆమె కాలర్ సరిగా లేదన్న విషయం గమనించారు. నోటితో చెప్పారు కదా... అంతటితో ఆగొచ్చు కదా. ఊహూ...తానే వెళ్లి ఆ లేడీ డాక్టర్ కాలర్ సరిచేశాడు. మంత్రివర్యుడు ఆ చర్యకు ఉపక్రమిస్తూంటే పాపం ఆ వైద్యురాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇక పక్కనే ఉన్న మరో మహిళా డాక్టర్ ఏమనుకుందో ఏమో. వెంటనే తన కాలర్ ను సరి చేసుకుంది. కాగా, మంత్రి చర్యపై సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు. ఏదేమైనా ఓ మహిళను తాకడం కరెక్ట్ కాదని వారంటున్నారు. అన్నట్టు ఈయన గారిపై గతంలో కూడా ఓ మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేసిందండోయ్. ల్యాబ్ కోటు ధరించలేదంటూ ఆయన ఆ లేడీ డాక్టర్ ను తిట్టారంట. దీంతో మంత్రి తనను మానసిక వేధింపులకు గురిచేరంటూ ఆమె ఏకంగా కోర్టును ఆశ్రయించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ