పంక్షన్ హాళ్ల బాత్ రూంల్లో సీక్రెట్ కెమెరాల ద్వారా యువతులు, మహిళలు స్నానం చేస్తుండగా చిత్రీకరించిన ఓ కీచకుడి బాగోతం అనంతపురంలో బయటపడింది. కళ్యాణ మండపాలను కేంద్రంగా చేసుకుని ఓ యువకుడు సాగించిన ఈ కీచక పర్వాన్ని ఎట్టకేలకు పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెళ్లి ఫంక్షన్ హళ్లను టార్గెట్ చేసుకున్న ఓ యువకుడు వాటి స్నానాల గదుల్లో రహస్య కెమెరాలను అమర్చాడు. వాటి సాయంతో యువతులు, మహిళలు స్నానం చేస్తుండగా షూట్ చేశాడు. ఆ తర్వాత వాటి ఆధారంగా వారిని డబ్బుతోపాటు లైంగిక కోర్కెల కోసం వేధించేవాడట. అతడి వేధింపులు తాళలేక ఓ యువతి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేయటంతో అసలు వ్యవహారం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టును చేధించారు. యువకుడిని అరెస్ట్ చేసి ఊచల వెనక్కి నెట్టారు.